హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కందికాయపల్లెలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం

NDL: పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో గురువారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో 9 లక్షలు రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆమె పేర్కొన్నారు.