హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చక్రాయపేటలో నేడు రెవెన్యూ సదస్సు

KDP: చక్రాయపేట మండల MRO కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు MRO విజయకుమారి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు JC నిధి మీనా ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుందని చెప్పారు.భూ,రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు, ప్రజలు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.