హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పింఛన్ నిబంధనలు సడలించాలి'

కోనసీమ: ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పథకం నిబంధనలను సడలించి, చేనేత కార్మికులను ఆదుకోవాలని వైసీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు జాన గణేశ్ కోరారు. గురువారం అప్పనపల్లి, జగ్గన్నపేట చేనేత నాయకులతో కలిసి ఆయన జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. 50 ఏళ్లు దాటిన అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ అందేలా చూడాలన్నారు.