KDP: కడప పాత బస్టాండ్ సమీపంలో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.ఎస్సై అమర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. నాగరాజుపేటకు చెందిన షేక్ యునస్‌ను అదుపులోకి తీసుకుని రూ.2,100 నగదు, మొబైల్ ఫోన్, మట్కా స్లిప్పు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్సై అమర్‌నాథ్ రెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో మట్కా బీటర్ అరెస్ట్


