హైదరాబాద్: 28°C
వ్యాపారం

రికార్డు స్థాయిలో పెరిగిన రాగి ధర

లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీ (LME)లో టన్ను రాగి ధర రికార్డు స్థాయిలో 14,737 డాలర్లకు (సుమారు రూ.14.07 లక్షలు) చేరింది. గతేడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువ. గనుల నుంచి తవ్వి తీసే రాగి ఖనిజ ఉత్పత్తి తగ్గడం, అమెరికా సుంకాల భయంతో పాటు పెద్దఎత్తున దిగుమతులకు దిగడం ప్రధాన కారణమని ఇండియన్‌ ప్రైమరీ కాపర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (IPCPA) తెలిపింది.