హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: అత్యవసర మరమ్మతుల నిమిత్తం శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మోరంపూడి, గణేష్ నగర్, సాయినగర్, వీఎల్ పురం, కోనేరుపేట, తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, శాఖ వారికి సహకరించాలని కోరారు.