హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి తిరిగి చేరిన మాచర్ల మైనార్టీ నాయకులు

PLD: వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం టీడీపీలో చేరిన మాచర్ల పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు అనూహ్యంగా గురువారం తిరిగి వైసీపీలో చేరారు. షేక్ కరిముల్లా, షేక్ అహ్మద్, బిల్డింగ్ సద్దాంలు మాచర్ల వైసీపీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పిన్నెల్లి వారికి పార్టీలోకి పునఃస్వాగతం పలికారు.