ATP: ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు (ఈ-పంట) చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి సూచించారు. శెట్టూరు మండల పరిధిలోని చిన్నంపల్లిలో గురువారం పర్యటించిన ఆయన, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. పొలాల్లో తేమను నిలుపుకోవడానికి జీవామృతం, యూరియా, పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు


