హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

ATP: గార్లదిన్నెలోని ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నారాయణను సస్పెండ్ చేస్తూ డిఇఓ అయుబ్ హుస్సేన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో డిఇఓ విచారణ చేయించారు. విచారణ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.