హైదరాబాద్: 28°C
వ్యాపారం

నర్సాపూర్(బి)ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ADB: ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్(బి)ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం నర్సాపూర్(బి) గ్రామంలో కలెక్టర్ రాజర్షి షా పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ఆశ్రమ పాఠశాల వంటగది, స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని స్పష్టం చేశారు.