హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్‌‌మా విత్తనాల పంపిణీ'

ASR: కొయ్యూరు మండలం లూసం, నిమ్మలగొంది, బలబద్రపాడు, గొల్లివలస రైతులకు గురువారం 90శాతం రాయితీపై రాజ్‌‌మా విత్తనాలను పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగు, గంజాయి సాగు నిర్మూలనలో భాగంగా విత్తనాలు అందిస్తున్నట్లు ఏవో శివరామ్ ప్రసాద్ తెలిపారు. మండలానికి 213 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయని, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.