హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరికపూడిశెల ప్రాజెక్టు పనులపై మంత్రి సమీక్ష

PLD: వెల్దుర్తి మండలంలోని వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై అమరావతి సచివాలయంలో గురువారం అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. ఏడు దశాబ్దాల క‌ల అయిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. కాగా, భూసేకరణ కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.63.14 కోట్లు మంజూరు చేసింది.