హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో రోడ్ల విస్తరణపై ఎమ్మెల్యే సమావేశం

KRNL: ఆదోని పట్టణంలో రోడ్ల విస్తరణపై ఎమ్మెల్యే పార్థసారథి మునిసిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పార్కింగ్‌ సదుపాయం లేకుండా నిర్మించిన భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది, అదనపు భారం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధమైన భవనాల వివరాలను పరిశీలించి వారం రోజుల్లో తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు.