కృష్ణా: పమిడిముక్కల మండల వ్యవసాయ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు పంట కోత ప్రయోగాలపై గురువారం శిక్షణ నిర్వహించారు. డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ మూర్తి మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా ఈ-పంట, ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. అప్పుడే మద్దతు ధర, ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఓ దీపికా చౌదరి, ఏవో గణేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట కోత ప్రయోగాలపై సిబ్బందికి శిక్షణ


