హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాఠశాలలో అదనపు గదులు నిర్మించాలి'

KRNL: ఆదోని మండగిరి పంచాయతీ పరిధిలోని ఆర్‌జీ నగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేసారు. 500 మంది విద్యార్థులకు ఆరు గదులు మాత్రమే ఉండటంతో కొందరు చెట్ల కింద చదువుకుంటున్నారని నాయకులు తెలిపారు. పైకప్పు మరమ్మతులు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.