ASR: రానున్న శీతాకాలం సీజన్‌లో చింతపల్లి మండలంలోని లంబసింగికి వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఎస్సీ సీహెచ్ తిరుపతిరావు రిసార్ట్స్ నిర్వాహకులకు సూచించారు. గురువారం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. రిసార్ట్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. పరిసరాల్లో సరైన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
లంబసింగి రిసార్ట్స్‌కు పోలీసుల భద్రతా సూచనలు


