హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెలవుల్లోనూ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు'

విశాఖపట్నం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు ఈ నెల12,13 తేదీల్లోనూ పనిచేస్తాయని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు దినాలు అయినప్పటికీ వినియోగదారుల సౌకర్యార్థం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు బిల్లులు చివరి తేదీలోపు చెల్లించాలని సూచించారు.