KDP: కడప బాలకార్మిక వ్యవస్థ, బాలలతో భిక్షాటనను పూర్తిగా అరికట్టాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు కె.జి. పద్మలత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆమె అంగన్‌వాడీ, ఆసుపత్రులు, జైళ్లు, వసతి గృహాలను తనిఖీ చేశారు. బాలలకు విద్య, వైద్యం, పౌష్టికాహారం, రక్షణ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాలల హక్కుల పరిరక్షణకు పటిష్ట చర్యలు


