హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు, రేపు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

శ్రీకాకుళంలో శిర్డీసాయి సేవా సంఘం, లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నగరంలోని మొండేటివీధిలో మట్టి వినాయక విగ్రహాలు, వ్రత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తామని జి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 12న డే అండ్ నైట్ కూడలి, సింధూర ఆసుపత్రి, రాగోలు దూసి రోడ్డు కూడలి వద్ద 1,500 విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.