KDP: జిల్లాలో నిన్న నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 465 కేసులు నమోదు చేసి రూ.1,08,560 జరిమానా విధించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి : ఎస్పీ


