హైదరాబాద్: 28°C
క్రీడలు

ASIA CUP: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

మహిళల ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో దిగిన బంగ్లా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 3, నందనీ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. శ్రీచరణి, ప్రేమ రావత్‌ చెరో వికెట్ తీశారు.