హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌తో సిరీస్ క్లీన్ స్వీప్‌ దిశగా ఇంగ్లండ్

పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇంగ్లండ్, మూడో టెస్టులోనూ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించేలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ను 133 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్, అనంతరం 453 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో 320 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.