హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. నిందితుడికి సంవత్సరం జైలు

గుంటూరు టౌన్ వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 మే 9న జరిగిన రోడ్డు ప్రమాద కేసులో నిందితుడికి గుంటూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కోర్టు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించింది. జేకేసీ కాలేజ్ జంక్షన్ వద్ద నిలబడిన ఆటో డ్రైవర్ షేక్ బాజీని అతివేగంగా కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన అంగడి బిక్షలుపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి B. మేరీ శారదానమ్మ ఈ మేరకు తీర్పునిచ్చారు.