హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పదవిపై రాజ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

NLG: మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇచ్చేది అధిష్టానమే కానీ సీఎం కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. నిధుల కోసం సీఎం, డిప్యూటీ సీఎంలను కలవడం నియోజకవర్గంలో ఒక భాగమేనని పేర్కొన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయలు ఉండడం సహజమేనన్నారు.