MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్‌లోని ఓ రైస్ మిల్లులో ధాన్యం అక్రమాలకు గురైనట్లు జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీశ్ తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి 3,307 క్వింటాళ్లు, 2025-26కు సంబంధించి 862 క్వింటాళ్ల ధాన్యం సుమారు రూ.కోటి మేర అవినీతి జరిగినట్లు గుర్తించామన్నారు. ధాన్యం సంచులు బదులు ధాన్యం పొట్టు సంచులు ఏర్పాటు చేసి అధికారులను పక్కదారి పట్టించినట్లు తెలిపారు.
తెలంగాణ
రైస్ మిల్లులో ధాన్యం అక్రమాలు


