హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి'

E. G: వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం కొవ్వూరులో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా 9 మంది లబ్ధిదారులకు రూ.4,54,251 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.