హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనల మేరకే గణేశ్ ఉత్సవాలు: సీపీ

కరీంనగర్‌లో గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సీపీ గౌష్ ఆలం తెలిపారు. అస్త్ర కన్వెన్షన్‌లో ఉత్సవ కమిటీలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మార్గదర్శకాల పోస్టర్‌ను విడుదల చేశారు. డీజేలకు అనుమతి లేదని, సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ తప్పనిసరని స్పష్టం చేశారు. వర్ష సూచన దృష్ట్యా మండపాల వద్ద తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.