హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గం చెరువులో రెండు రోజులు నో ఎంట్రీ

HYD: నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్గం చెరువులోకి సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. HMWSSB ఆధ్వర్యంలో మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో నేడు, రేపు ఎంట్రీని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు పర్యాటకులు దుర్గం చెరువు వద్దకు రావద్దని సూచించారు. పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.