హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద మాక్ డ్రిల్

TPT: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ల వద్ద ఆక్టోపస్ కమాండోలు గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్ర ముప్పు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థవంతంగా స్పందించే విధానంపై కమాండోలు విన్యాసాలు చేపట్టారు. ఆధునిక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లతో హై సెక్యూరిటీ జోన్‌లో భాగంగా ఆక్టోపస్, ఏపీఎస్పీ, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భద్రతా సన్నద్ధతను ప్రదర్శించారు.