హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు (M) చోడవరంలో నూతన గ్రంథాలయాన్ని MLA బోడె ప్రసాద్ గురువారం ప్రారంభించారు. రూ.20 లక్షల విలువైన భూమిని ఉచితంగా అందించిన దాత ప్రసాద్‌కు, CSR ద్వారా రూ.10 లక్షలు అందించిన కెనరా బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధిలో విద్య, విజ్ఞానం కూడా కీలకమన్నారు. రోడ్లు, డ్రైనేజీ, RBK, విద్యుత్, వాటర్ ట్యాంక్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.