హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచే క్విజ్ పోటీలు

NGKL: జిల్లాలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల వార్షిక వారోత్సవాల్లో భాగంగా తెలుగు శాఖ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ వై. కృష్ణయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. తెలుగు సాహిత్యం, సాంస్కృతిక చరిత్రపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో సంస్కృతిపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.