హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల డీఎస్పీ మోయిన్ కీలక ఆదేశాలు

BPT: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించేలా కమిటీ సభ్యులు పోలీసుల నిబంధనలు పాటించాలని చీరాల డీఎస్పీ మోయిన్ సూచించారు. రావివారి కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుకు పోలీసు, విద్యుత్, అగ్నిమాపక శాఖల అనుమతులు తప్పనిసరన్నారు. సీసీ కెమెరాలు అమర్చాలని, మైక్ సౌండ్ ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు అనుమతి ఉంటుందన్నారు.