VKB: దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్ గ్రామంలో సప్తభజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
తెలంగాణ
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక భజనలు


