హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌కు కౌన్సిలర్ వినతి

WGL: నర్సంపేట మున్సిపాలిటీలో నెల రోజులుగా డిజిటల్ కీ హోల్డ్‌లో ఉండటంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్సుల జారీ నిలిచిపోయిందని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ఆరోపించారు. డిప్యూటేషన్ కమిషనర్ నిర్లక్ష్యంతోనే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.