హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంకు సమ్మెను విజయవంతం చేయాలి: CITU

W.G: సెప్టెంబర్ 11న జరిగే దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు CITU పూర్తి మద్దతు ఇస్తుందని నాయకులు పెంకి అప్పారావు, తవిటి నాయుడు తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆకివీడులోని పలు బ్యాంకుల్లో గురువారం వారు ప్రచారం నిర్వహించారు. ప్రధాన బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు సైతం విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు.