హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంట్రాక్టు ఉద్యోగుల శాంతియుత నిరసన'

ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గురువారం శాంతియుత నిరసన చేపట్టారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాట్యుటీ ప్రయోజనంతో పాటు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.