హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధికంగా పొగాకు పండించే అనార్ధాలు తెచ్చుకోవద్దు'

ప్రకాశం: జరుగుమల్లి (M) అక్కచెరువుపాలెంలో పొగాకు నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం కొండపి వేలంకేంద్రం నిర్వహణ అధికారి శంకర్రావు అధికంగా పొగాకు సాగు చేస్తే జరిగే అనర్థాలను వివరించారు. ఈ ఏడాది పొగాకు మార్కెట్ సంక్షోభం అధిక పంట వలనే వచ్చిందని రైతులకు వివరించారు. పొగాకు బోర్డు అనుమతించిన మేర మాత్రమే పొగాకు పండించాలని అన్నారు.