హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చినమామిడిపల్లిలో CMRF చెక్కుల పంపిణీ

W.G: నరసాపురం మండలం చినమామిడిపల్లిలో అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ముగ్గురు లబ్ధిదారులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరామర్శించారు. గురువారం వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మంజూరైన రూ.1,89,155 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఇళ్ల వద్దే అందజేశారు.