MDCL: మేడ్చల్ పరిధిలోని కిష్టాపూర్‌లో కాసా గ్రాండ్ సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 భారీ టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు, రవాణా బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ భూపాల్ హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ మట్టి తరలింపు.. 7 టిప్పర్లు సీజ్


