హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైయస్ జగన్‌ను కలిసిన శైలజానాథ్

ATP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ కలిశారు. ఈ భేటీలో పలు స్థానిక అంశాలపై చర్చించారు. జిల్లాలో స్థానిక సంస్థల్లో అన్నిచోట్ల విజయం సాధించేలా నేతలు కృషి చేయాలని వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు.