హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగర తీర మహా గణపతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో జరగనున్న సాగర తీర మహా గణపతి ఉత్సవాల ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపిచంద్ పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్ర పర్యవేక్షణలో 63 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 14 నుంచి 24వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో విశాలమైన క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.