హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మణపల్లెలో మహిళా భద్రతపై అవగాహన

KDP: పులివెందుల మండలం బ్రహ్మణపల్లెలో సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో మహిళా భద్రత, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్‌లపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగం, అత్యవసర సమయంలో డయల్‌ 112, సైబర్ మోసాలకు 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. OTP, బ్యాంకు వివరాలు, గుర్తుతెలియని లింకులు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపారు.