హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తాం: ఎమ్మెల్యే

ELR: 2027 సెప్టెంబర్- ఆక్టోబర్‌లో పాదయాత్ర చేస్తానని YCP అధినేత జగన్ ప్రకటించిన నేపథ్యంలో దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ స్పందించారు. గతంలో జగన్ పాదయాత్ర చేస్తానంటే చంద్రబాబు ఊరుకున్నారని, ఈసారి పాదయాత్ర ఎలా చేస్తారో.. ఎలా సాగుతుందో చూస్తామని సవాల్ విసిరారు. జగన్ పాదయాత్రపై చింతమనేని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.