ASR: రానున్న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. వ్యక్తిగత విభేదాలు, వర్గాలకు అతీతంగా పార్టీ కోసం సమష్టిగా ముందుకు సాగాలన్నారు. గురువారం అరకులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం'


