హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి జనసేన చేయూత

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన మత్స్యకారుడు పిక్కి రమణ ఒడిశాలో సముద్ర వేటకు వెళ్లి గల్లంతై మృతి చెందారు. బాధిత కుటుంబానికి జనసేన నాయకులు గురువారం రూ.40 వేల ఆర్థిక సాయం అందజేసి పరామర్శించారు. ప్రభుత్వ సాయం కూడా అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిక్కి కోదండరావు పాల్గొన్నారు.