SRPT: తుంగతుర్తి మండలం బండరామారం జడ్పీహెచ్‌ఎస్‌లో పూర్వ విద్యార్థులు దాతృత్వం చాటుకున్నారు. గురువారం పాఠశాలలో చదివి కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సాధించిన సత్తయ్య, స్వామి, వెంకటేష్, సరిత, మస్తాన్, జహంగీర్, రవిలు రూ.25వేల విలువైన క్రీడా వస్తువులను అందజేశారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి అందించడం అభినందనీయమని సర్పంచ్ కోరుకొప్పుల నరేష్‌గౌడ్ అన్నారు.
తెలంగాణ
పాఠశాలకు పూర్వ విద్యార్థుల దాతృత్వం


