హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వృద్ధుడికి అంత్యక్రియలు

ములుగు పరిధిలో ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సై బి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ములుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ములుగు మున్సిపాలిటీ సిబ్బంది కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసుల సేవాభావాన్ని పలువురు అభినందించారు.