హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా పోషకాహార మహోత్సవం

SKLM: సంతబొమ్మాళి మండలం నౌపడ అంగన్వాడీ కేంద్రాలు 1, 2లలో పోషణ్ మాసం సందర్భంగా పోషకాహార మహోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలతో వంటల ప్రదర్శన చేశారు. సమతుల ఆహారం ప్రాధాన్యతను తల్లులకు వివరించారు. సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని సూపర్వైజర్ ఉషశ్రీ తెలిపారు.