హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి'

ATP: జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు.