హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోండి'

KKD: అర్హులెవరూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు దూరం కాకూడదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. గురువారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో క్లస్టర్, డివిజన్ ఇన్‌చార్జిల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పెన్షన్లకు అర్హులైన వారు ఈ నెల 16లోపు స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులు దరఖాస్తు చేసుకునేలా కూటమి శ్రేణులు సహకరించాలన్నారు.